మియాపూర్, సెప్టెంబర్ 6 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపడమే తన లక్ష్యమని, ఇందుకోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో అధిక నిధులు మంజూరు చేయిస్తూ ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కరోనాతో రెండేండ్లుగా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి సౌకర్యానికి ఎక్కడా లోటు రాకుండా తమ ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్లో రూ.4,70 కోట్ల నిధులు, ఆల్విన్ కాలనీ డివిజన్లో రూ.4.21 కోట్లతో చేపట్టబోయే యూజీడీ పునరుద్ధరణ పనులకు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేశ్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు.
విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి నెలకొన్న మురుగు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఆన్ని కాలనీలకు యూజీడీ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యం కోసం ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు, ప్రతి వీధికి వీటిని విస్తరించే వరకు తాను శ్రమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
సౌకర్యవంతమైన రహదారులు, మురుగునీరు నిల్వలేని దారులు, ప్రతి ఇంటికీ తాగునీరు, క్షణం అంతరాయం లేకుండా విద్యుత్, ఆహ్లాదాన్నందించే పచ్చదనపు చెరువుల పరిసరాలు లక్ష్యంగా విస్తృతంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడొద్దని, ఎక్కువ కాలం మన్నికతో సేవలు లభించేలా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
నిర్మాణాల సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల పార్టీ నేతలు జిల్లా గణేశ్, శ్రీనివాస్‌యాదవ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, పురుషోత్తం యాదవ్, గంగాధర్‌రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్‌రెడ్డి, గోపాల్‌రావు, మహేందర్, ఖాజా, జహంగీర్, సాయి, చంద్రికప్రసాద్, రోజా, మోజెస్, శ్రీనివాస్, సతీశ్, కాశీనాథ్, రాజేశ్, మధు, భాస్కర్, మున్నా, వాసు, యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్, సెప్టెంబర్ 6 : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్లో రూ.4.09 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా పనులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోపి, కరుణాకర్‌గౌడ్, వెంకటేశ్, గురు చరణ్, ప్రవీణ్, గుడ్ల ధనలక్ష్మి, ప్రీతమ్, వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, మల్లేశ్, గోవర్ధన్, అక్బర్‌ఖాన్, శ్రీకాంత్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.