మియాపూర్ , ఆగస్టు 29 : ప్రజా ఆరోగ్యానికే సవాల్‌గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో వివేకానందుడి విగ్రహం వద్ద రూ. 11 లక్షలతో చేపట్టిన జంక్షన్ సుందరీకరణ పనులతో పాటు పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీస్ విగ్రహాలను కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ గాంధీ శనివారం రాత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించే మనసుకు వైద్యరంగం, పనిచేసే చేతులకు పారిశుధ్య కార్మికులు, స్పందించే మనసుకు పోలీసు శాఖ నిదర్శనంగా వారి విగ్రహాల ఏర్పాటు ఆలోచన గొప్పదన్నారు. ఉన్న కొద్ది స్థలాన్ని సద్వినియోగం చేసి సుందరవనంగా తీర్చిదిద్దిన అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ స్వప్ప, సుధాకర్, భద్రయ్య, పార్టీ నేతలు రంగారావు, సంజీవ్, చంద్రకాంత్‌రావు, రాజేశ్వర్‌రావు, రాంచందర్‌రావు, కార్తీక్‌రావు, విజయబాబు, ప్రసాద్,అల్లం మహేశ్, ప్రవీణ్, మురళీ, రమణారెడ్డి, జగదీశ్, రవీందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో వడ్డెర సంక్షేమ సంఘం కార్యాలయాన్ని కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, రంగారావుతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘానికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు జిల్లా గణేశ్, సంజీవ, సంఘం నేతలు యాదగిరి, కాశీనాథ్, ఖైసర్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్, ఆగస్టు 29 : సీఎం సహాయ నిధి పేదల ఆరోగ్య భద్రత కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ అన్నా రు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్ సాయినగర్‌కు చెందిన శరీన బేగంకు రూ. 2 లక్షల ఎల్వోసీని ఆదివారం తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు జిల్లా గణేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.