మియాపూర్, ఆగస్టు 28 : మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్‌నగర్ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నట్లు, వారి తోడ్పాటుతో అధిక నిధులతో పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు, నియోజకవర్గానికి ఈ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మెరుగైన రవాణా సహా అన్ని వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, ఆదిత్యనగర్, హెచ్ఎంటీ హిల్స్, భాగ్యనగర్ ఫేజ్-2, రాంనరేశ్నగర్, అల్లాపూర్ సొసైటీ కాలనీ, హైదర్‌నగర్‌లో రూ.4.09 కోట్లతో చేపట్టనున్న యూజీడీ పైపులైన్ విస్తరణ పనులకు కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి విప్ గాంధీ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో అధిక నిధులతో అన్ని డివిజన్లలో విస్తృతంగా పనులను చేపడుతున్నామన్నారు. ప్రజల సౌకర్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టే పనుల్లో నాణ్యతాప్రమాణాలను పాటించాలని సూచించారు. మురుగు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా యూజీడీ లైన్లను అన్ని కాలనీలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు గాను సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు.
ప్రజలందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజీవ్, మహదేవ్, పార్టీ నేతలు రంగారావు, దామోదర్‌రెడ్డి, రాజేందర్, కృష్ణ, వెంకటేశ్, సత్యనారాయణ, గోపీచంద్, బాలయ్య, అష్రాఫ్, రాజు, సద్దాం, రామకోటేశ్వర్రావు, ఉమా, వెంకట్, శివ, అనిల్, అప్పిరెడ్ది, కృష్ణకుమారి, విమల, మాధవి, లత, పర్వీన్, జుబేదా, జబీన్, హమీద్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్‌నగర్‌లో కార్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సుమన్, మల్లాది మంజులత ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్లు, పేద మహిళలకు కుట్టుమిషన్లు, ఇస్త్రీ పెట్టెలను, నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ తరహా సేవలను ఆదర్శంగా తీసుకోవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గణేశ్, దొడ్ల రామకృష్ణగౌడ్, శ్రీనివాస్, కాశీనాథ్, షౌకత్ అలీ, భాస్కర్, యాదగిరి, వాసు, శ్రీనివాస్, సిద్ధయ్య, నర్సింహులు పాల్గొన్నారు.