మియాపూర్, ఆగస్టు 18 : నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి పథకం నిలుస్తున్నదని, అత్యవసర సమయాలలో భరోసాను నింపుతున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 9మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ. 4,29,500ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ గాంధీ బుధవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడే పేదలకు కార్పొరేట్ వైద్యం అందుకునేందుకు సీఎం సహాయనిధి పథకం ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, పార్టీ నేతలు పోతుల రాజేందర్, శ్రీనివాస్‌చౌదరి, ఎల్లం నాయుడు, తిరుపతి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.