మియాపూర్, ఆగస్టు 17 : క వసతులను కల్పించి కాలనీల అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సంక్షేమ సంఘాలు సైతం కాలనీ పురోగతితో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా భాగస్వాములు కావాలన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ ప్రతినిధులు విప్ గాంధీని వివేకానందనగర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని విప్ గాంధీ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలను సమన్వయం చేసుకుని సమిష్టిగా కాలనీ సంఘాలు ముందుకు సాగాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రావు, ప్రతినిధులు దశరథరావు, విద్యాదర్చారి, రమేశ్ చంద్ర, సురేశ్, విరూపాక్షయ్య, రామయ్య పాల్గొన్నారు.