హఫీజ్‌పేట్, ఆగస్టు9: ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని అందాల మధ్య స్వచ్ఛమైన గాలిపీలుస్తూ కసరత్తులు చేసేలా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం హఫీజ్‌ఫేట్ డివిజన్ జయశంకర్పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, కమాన్ (ఆర్చ్)ను కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు, వాకర్స్ అసోసియషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా పచ్చని అందాల మధ్య కసరత్తులు చేసుకొనేలా ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూపాయి ఖర్చులేకుండా పచ్చని ఆహ్లాదకరవాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ అత్యాధునికవసతులతోకూడిన ఓపెన్‌జిమ్‌లను జీహెచ్ఎంసీ అధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కార్పొరేటర్ పూజితగౌడ్ మాట్లాడుతూ.. రాళ్లురప్పలకు నిలయమైన ఆ ప్రాంతాన్ని లక్షల రూపాయలు వెచ్చించి పచ్చదనం వెల్లివిరిసేలా చేయడమేగాకుండా ప్రస్తుతం అదనపు హంగులతో ఓపెన్‌జిమ్ ఏర్పాటు కావడం ఎమ్మెల్యే చొరవతోనే సాధ్యమైందని అందుకు డివిజన్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు బాల్లింగ్ గౌతంగౌడ్, గౌరవాధ్యక్షుడు వాలా హరీశ్, లక్ష్మారెడ్డి, సాయిబాబా, మనోహర్‌గౌడ్, శ్రీనివాస్, రవికుమార్, చంద్రశేఖర్, రాజేశ్వర్‌గౌడ్, మోసినుద్దీన్, నాగేశ్వరరావు, ప్రభాకర్‌రావు, ప్రసాద్, నారాయణరెడ్డి, జ్ఞానేశ్వర్, బాలసుబ్బయ్య, భగత్, శ్రీను, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.