మియాపూర్, ఆగస్టు 6 : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువుల సుందరీకరణకు తగిన నిధులు మంజూరు చేయాలని, చెరువులను రక్షించుకోవడంతోపా టు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాలని రంగారెడ్డి కలెక్టర్ అమేయ్‌కుమార్‌ను ప్ర భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. శేరిలింగంపల్లి జో నల్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన కలెక్టర్‌ను విప్ మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. చె రువులు కబ్జాకు గురికాకుండా కాపాడాలని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్దేశిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో చెరువులను సుందరీకరించుకునేందు కు ప్రభుత్వ నిధులు లేని పక్షంలో సీఎస్ఆర్ నిధులను మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. చెరువుల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా చెరువుల్లోకి ము రుగునీరు పోకుండా 7 ఎస్టీపీలను మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు విప్ గాంధీ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఎస్టీపీల నిర్మాణానికి తగిన స్థలాలను కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు విప్ పేర్కొన్నారు. సమావేశంలో జోనల్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్ పాల్గొన్నారు.