భయపెట్టి.. ఓట్లు దండుకొని..
కొల్లాపూర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఓటర్లను భయపెట్టి.. ప్రలోభాలకు గురిచేశారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కొ ల్లాపూర్ మున్సిపాలిటీలోని 16వ వార్డు పరిధిలోని రాజవీధిలో ఆర్ఐడీ ప్రభుత్వ పాఠశాలలో క్యూలో నిలబడిన బీరం, విజయమ్మ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- పుర పోరులో అడుగడునా అధికార పార్టీ నేతల ఆగడాలు
- ఎలాగైనా గెలవాలనే..
- కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 11 : కొల్లాపూర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఓటర్లను భయపెట్టి.. ప్రలోభాలకు గురిచేశారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కొ ల్లాపూర్ మున్సిపాలిటీలోని 16వ వార్డు పరిధిలోని రాజవీధిలో ఆర్ఐడీ ప్రభుత్వ పాఠశాలలో క్యూలో నిలబడిన బీరం, విజయమ్మ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మా ట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకు లు ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ చే యడంతోపాటు భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకొన్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులపైకి పోలీసులను పంపి ప్రచారంలో తిరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు చెందిన నాయకు లు, కార్యకర్తలు కొల్లాపూర్‌లో తిరుగుతూ ఓటర్లను భయపెట్టినా పోలీసులు, అధికారు లు పట్టించుకోకపోగా.. వారికి సహకారం అ ందించారని మండిపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ చూ స్తుందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్కే గెలుపు పక్కా అన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

