శేరిలింగంపల్లి, జూలై 28: కంచె గచ్చిబౌలి నవోదయ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని నవోదయ కాలనీలో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ నీటి సమస్యకు నేటితో పరిష్కారం లభించిందని, ఇది కాలనీవాసులకు ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జలమండలి జీఏం రాజశేఖర్, డీజీఏం శ్రీమన్నారాయణ, మేనేజర్ యాదయ్య, జీహెచ్ఎంసీ అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, టీఆర్ఎస్ నాయకులు పల్లపు సురేందర్, మంత్రిప్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.