మియాపూర్, ఫిబ్రవరి 24: బస్ స్టాప్ ఉన్న మతిస్థిమితం సరిగ్గా లేని ఓ మహిళను రేప్ చేసిన ఘటనలో మియాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం మియాపూర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కూకట్ చెందిన ఓ మహిళ(35)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నెల 21వ తేదిన మియాపూర్ బస్ స్టాప్ వద్ద ఉన్న సదరు మహిళను అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి బలవంతంగా ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
కాగా సదరు మహిళను కిడ్నాప్ చేస్తుండగా ఈ విషయాన్ని గమనించిన ఓ క్యాబ్ డ్రైవర్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కిడ్నాప్ నమోదు చేసుకున్న మియాపూర్ దర్యాప్తు చేపట్టారు. మూడు గంటల ద్వారా ఐడిఏ బొల్లారం వద్ద ఆ మహిళను గుర్తించారు. కాగా, అమె కు మతిస్థిమితం సరిగ్గా లేనట్లు గుర్తించి, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అమెపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు ధృవీకరించడంతో పోలీసులు కిడ్నాప్ రేప్ నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులు పాత నేరస్థులు బాలకుమార్(25), మహేష్ అదుపులోకి తీసుకున్నారు.