సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సమైఖ్య రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు ఒకసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన మంచినీళ్ల పండగ సంబురాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది వరకు హైదరాబాద్‌లో తాగు నీటి విషయంలో ఘోరమైన పరిస్ధితి ఉందేదని, ప్రస్తుతం అది మారిందరన్నారు. ఈ పరిస్థితి మారడంలో జలమండలి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా తాగునీరు సరఫరా చేయడంలో ఎంతో కృషి చేస్తున్నందుకు జలమండలి ఎండీ దానకిశోర్, అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
హైదరాబాద్‌లో ఒకప్పుడు ట్యాంకర్ల దగ్గర గొడవలు, ఖాళీ బిందెలతో ధర్నాలు సాధారణంగా జరిగేవని.. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ నీటి కష్టాలు తొలగిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంచినీళ్ల పండగ చేసుకునే నైతిక హకు తెలంగాణ ప్రజానీకానికి ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపారని హోం మంత్రి మహమూద్ అలీ పేరొన్నారు. అనంతరం జలమండలి, మిషన్ భగీరథ అధికారులను మంత్రలు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జలమండలి డైరెక్టర్లు, కొణతం దిలీప్, ఉన్నతాధికారులు, వాటర్ వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇతర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Hyd7
ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో..
ఖైరతాబాద్‌లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో ఆదివారం జరిగిన మంచినీళ్ల పండగ సంబురాల్లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు. మహానగరానికి మంచినీళ్ల సమస్య రాకుడదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు దీర్ఘకాల ప్రణాళికలు రచించారని పేరొన్నారు. ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు వారం రోజులకోసారి నీళ్లిచ్చే స్థాయి నుంచి.. ప్రస్తుతం రెండు రోజులకోసారి ఇచ్చే స్థాయికి చేరుకున్నామన్నారు.