మిస్ వరల్డ్ ముద్దు గుమ్మలు నగరంలోని శిల్పారామం, విక్టోరియా భవనాన్ని సందర్శించారు. శిల్పారామంలో సాంస్కృతి, సంప్రదాయాల రూపాలను, చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. కుండులు చేస్తూ మురిసిపోయారు. సరూర్‌నగర్‌లోని విక్టోరియా హోమ్‌ను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు ఈనెల 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే పోటీ ఉండనున్నది. ఇప్పటికే జరిగిన పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. అందులో ఇండియా నుంచి నందిని గుప్తా ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్ రౌండ్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనున్నది.
– సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ)
Hyd3