Miss Universe Telangana | బంజారాహిల్స్ , జూన్ 3: ఈ నెల 7, 8వ తేదీల్లో హైదరాబాద్‌లో మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ పోటీలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో సాష్ పేరుతో మంగళవారం ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు.
జూన్ 7వ తేదీన దారా కన్వెన్షన్ హాలులో మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనల్స్ జరగనున్నాయి. జూన్ 8వ తేదీన మిస్ యూనివర్స్ ఆంధప్రదేశ్ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది చొప్పున యువతులు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు.