ACB Raids | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మీర్పేట ఎస్సై
ACB Raids | లంచం కేసులో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్స్టేషన్ (Meerpet SI) లో ఎస్సైగా పనిచేస్తున్న బొడ్డుపల్లి సైదులు లంచం(Bribe) తీసుకుంటూ పట్టుబడ్డాడు.
మీర్పేట (హైదరాబాద్) : లంచం కేసులో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్స్టేషన్ (Meerpet SI) లో ఎస్సైగా పనిచేస్తున్న బొడ్డుపల్లి సైదులు లంచం(Bribe) తీసుకుంటూ పట్టుబడ్డాడు. శనివారం ఏసీబీ (ACB) అధికారులకు అందిన సమాచారం మేరకు పోలీసుస్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారి మదాని సుభాష్ నుంచి ఎస్సై సైదులు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
నజముద్దీన్ అనే వ్యక్తి పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గాను ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

