Hyderabad | సైదాబాద్, జూలై 13 : పదేళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సైదాబాద్‌లో నివసించే ఓ మహిళకు బాలుడు, బాలిక (10) ఉన్నారు. ఇంటి సమీపంలో ఉండే ఓ యువకుడు సదరు బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను గమనించి శనివారం సాయంత్రం తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.