అత్యల్ప కాలంలోనే తెలంగాణ అపూర్వమైన ప్రగతి సాధించి.. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నది. ఇందులోభాగంగానే గ్రేటర్‌వ్యాప్తంగా శుక్రవారం సంక్షేమ సంబురాలను వైభవంగా నిర్వహించారు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. సంక్షేమ పథకాల రూపకల్పన, అమల్లో తెలంగాణ రాష్ట్రం రోల్ మాడల్‌గా నిలుస్తున్నదన్నారు. ఈ సందర్భంగా గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీతో పాటు బీసీల్లో కులవృత్తులను ఆధారం చేసుకొని జీవనం సాగించే వృత్తి పనివారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించి చేయూతనందించారు. 59 జీవో లబ్ధిదారులకు పట్టాలను అందించారు. కాగా, సిటీ కళాశాల సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. షాదీముబారక్ పథకం ప్రయోజనాలపై దివ్యాంగుడైన విద్యార్థి జామి ఉమేర్ చక్కటి వ్యాసం రాసి.. ప్రశంసలందుకున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలను ప్రారంభించింది. నూతన పథకాలైన గృహలక్ష్మి, కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకాలతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల జిల్లా వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. గృహలక్ష్మి, బీసీ కులాల్లోని కుల వృత్తుల లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందించారు. రెండో విడత గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా జిల్లాల్లో లబ్ధిదారులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని, గొర్రెలను అందజేశారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి, కులవృత్తుల వారు, గొర్రెల లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల మేలుకోరే బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి రావాలని చల్లని మనస్సుతో దీవించారు.
సిద్దిపేటలో సెట్విన్-షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన లబ్ధిదారులకు కుట్టుమిషన్లు అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ
సూర్యాపేట మండలం టేకుమట్లలో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
వరంగల్ జిల్లా నర్సంపేటలో కులవృత్తిదారుడికి రూ.లక్ష చెక్కు అందజేస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య
ఖమ్మం నగరంలో బీసీ రుణ చెక్కు అందజేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్లో రూ.లక్ష ఆర్థిక సాయం చెకును అందజేస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రజాప్రతినిధులు
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో గొర్రెల యూనిట్ అందుకున్న లబ్ధిదారుడితో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, పక్కన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని శుభం గార్డెన్లో జరిగిన సంక్షేమ సంబురాల్లో భాగంగా గొర్రెల పెంపకం దారులకు యూనిట్లను అందజేస్తున్న మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం వద్ద గొర్రెల యూనిట్ల పంపిణీలో గొర్రెను ఎత్తుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో గొల్లకురుమలు బహూకరించిన గొర్రె పిల్లతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి