హైదరాబాద్ : కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని, విజయవాడలో ని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవార్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయా దేవాలయాల వద్ద అధికారుల ఆధ్వర్యంలో పండితులు ఘన స్వాగతం పలికారు. మంత్రి, కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పూజల్లో పాల్గొన్న మంత్రి