నేడు మరో 13 వార్డు కార్యాలయాలు ప్రారంభం
నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్‌లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
- మెరుగైన సేవలందించేందుకే వార్డు ఆఫీసులు
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్‌లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, వార్డు ఆఫీసుల ఏర్పాటుతో జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు వార్డు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు ఒక్కో వార్డు ఆఫీస్ చొప్పున 150 ఆఫీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే 137 ఆఫీసులను మంత్రులు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు.
సనత్‌నగర్‌లోని రాంగోపాల్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్‌పూర్, అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసులను మంత్రి తలసాని, గోషామహల్‌లోని మూడుచోట్ల హోంమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ రాంనగర్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీ, నాంపల్లి మెహిదీపట్నంలో మేయర్ విజయలక్ష్మి, నాంపల్లిలోని విజయ్‌నగర్‌కాలనీ, బజార్ఘాట్లలో ఎమ్మె ల్సీ ప్రభాకర్‌రావు, అహ్మద్‌నగర్, సాయిబాబా దేవాలయాల వద్ద ఏర్పాటు కార్యాలయాలను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | బొట్టు పెట్టి.. ‘దీక్షా దివస్’కు ఆహ్వానం.. 29న సభ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నేతల సన్నాహాలు!
Jensen Huang | జెన్సన్ రిటర్న్స్.. ఎన్విడియా సీఈవోగా మళ్లీ పగ్గాలు!
Unemployment | నిరుద్యోగ పాపం ప్రైవేటుదేనట.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మోదీ యత్నం
Nagarjuna Sagar | ఉన్న నీళ్లకూ ఏపీ ఎసరు.. కృష్ణాడెల్టాకు అదనంగా 10 టీఎంసీల డిమాండ్!
బంగ్లా 91 ఆలౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

