హైదరాబాద్: నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని మినిస్టర్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ కూల్చివేత ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. డెక్కన్ మాల్ పరిసరాల్లోని ఇండ్లకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనం కూల్చివేశామన్నారు.
ఈ సందర్భంగా అగ్నిప్రమాదం వల్ల దెబ్బతిన్న నివాసాలకు మరమ్మతులు చేంచాలని స్థానికులు మంత్రి కోరారు. దీంతో నెల రోజుల్లో మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.