నాంపల్లి, అక్టోబర్ 27: రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పని చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.100 కోట్ల ఆశ చూపినా నిఖార్సయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్ర, గోవా రాష్ర్టాల్లోని ప్రభుత్వాలను కూల్చినట్టు తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం వారి డ్రామాలు సాగవన్నారు. వేల కోట్ల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అవినీతిపరుడైన రాజగోపాల్‌కు అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్కు జరుగుతున్న యుద్ధంలో మునుగోడు ప్రజలు ఏవైపు ఉండాలో తేల్చుకోవాలన్నారు. ప్రచారంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, పానుగంటి వెంకన్నగౌడ్, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, కుంభం చరణ్‌రెడ్డి, ఇట్టం వెంకట్‌రెడ్డి, కంశెట్టి పాండు ఎదుళ్ల జంగయ్య, కురుపటి నాగరాజ్, సంగెపు గణేశ్, గాదపాక రమేశ్, ఎదుల్ల యాదగిరి, కర్నె యాదయ్య, పూల చక్రధర్ పాల్గొన్నారు
ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్దే విజయం..
వనస్థలిపురం, అక్టోబర్ 27 : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్బీనగర్లో ఉన్న మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల ప్రజల ఆత్మీయ సమ్మేళనాన్ని గురువారం హస్తినాపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీప్రసన్న, సామ రమణారెడ్డి పాల్గొన్నారు.