బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 10: పేదలు గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండు పడక గదు ల ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని, హమాలీ బస్తీవాసులు ముందుకు వస్తే నిర్మాణం ప్రారంభించడానికి సర్కారు సిద్ధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం పద్మారావునగర్‌లోని హమాలీ బస్తీలో శుక్రవారం లబ్ధిదారులతో ఆయ న సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ స్వయం గా సీఎం కేసీఆర్ రెండుసార్లు హమాలీ బస్తీలో పర్యటిం చి, ఇరుకైన ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు ‘డబుల్’ ఇం డ్ల నిర్మాణం కోసం రూ.17 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.
అత్యంత ప్రధాన ప్రాంతంలో ఉన్న ఈ బస్తీ భవిష్యత్తులో అద్భుతమైన భవన సముదాయంగా మారుతుందని, ఇండ్ల విలు వ కూడా ఎంతో పెరుగుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి బస్తీవాసులు అంగీకారం తెలిపిన నేపథ్యంలో.. ఈ నెల 9న రెవెన్యూ శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, ముషీరాబాద్ తాసీల్దార్ జానకి, బేగంపేట్ సర్కిల్ కమిషనర్ ముకుందరెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, పవన్ కుమార్ గౌడ్, మహేశ్, లక్ష్మీపతి, శివప్ప, సుభాస్, సత్యనారాయణ, కుశాల్, రవి, శ్యామ్, రాందాస్, వెంకటేశ్, శ్రీనివాస్, రాజు, బాబురావు పాల్గొన్నారు.