మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 4: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మంత్రి సమక్షంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ.. పాలక మండ లి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌గా ఎస్.జయరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయం ఎంతో చారిత్రక ఆలయం అని, దీని అభివృద్ధి విషయంలో పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఈసారి గణపతి ఆలయంలో వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జయరాజు, పాలక మండలి సభ్యులు కృష్ణకుమార్, సత్యనారాయణ, మహేందర్ కుమా ర్, సాయి ప్రకాశ్, అమరేందర్, వజీర్ మోహన్, హన్మంతరావు, ఆంజనేయులు, అనిత, రాంమోహన్, శ్రీను, పిల్లి శ్రీనివాస్‌రావు, శ్రీశైలం, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, లాస్యనందిత, మాజీ కో ఆప్షన్ సభ్యుడు నర్సింహాముదిరాజ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు నర్సారెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆకుల హరికృష్ణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.