
మారేడ్పల్లి, ఆగస్టు 22 : రెజిమెంటల్బజార్లోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సంతోషిమాత అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, నాదస్వరం, 5.30 గంటలకు మూలవిరాట్ శుద్ధి, క్షీరాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. 6.30 గంటలకు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే జి. సాయన్న, కార్పొరేటర్ కొంతం దీపిక, టీఆర్ఎస్ యువ నాయకులు రామేశ్వర్గౌడ్, మాజీ జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహముదిరాజ్లు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, పాలక మండలి సభ్యులు సత్కరించారు. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నాయకులు ఆకుల హరికృష్ణ, ఈఓ విఠలయ్య పాల్గొన్నారు.