బన్సీలాల్‌పేట్, ఆగస్టు 19 : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించిన ప్రభుత్వానికి పలు ఆలయాల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం న్యూబోయిగూడలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన శ్రీ రేణుకా ఎల్లమ్మ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి సన్మానించారు. ప్ర భుత్వం ఆర్థికంగా ఆలయాలకు సహకరించడం, బో నాల జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం వలన ప్రజలు ఎంతో ఆనందంగా, భక్తి శ్రద్ధలతో పండుగను నిర్వహించుకున్నారని అన్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు సురేశ్, ప్రధాన కార్యదర్శి వినోద్, నరేందర్, పార్వతి, కిరణ్, సాయికుమార్ పాల్గొన్నారు.
అమీర్‌పేట్, ఆగస్టు 19 : బోనాల పండుగ విజయవంతం కావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు భేష్ అని టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిబాబా చారి అన్నారు. గురువారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాప్యాదవ్ను ఆయన నివాసంలో కలిసి అసోసియేషన్ తరపున జ్ఞాపికను బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సురేశ్‌చారి, కుమ్మరి ప్రసాద్, శివశంకర్, యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.