బేగంపేట్ ఆగస్టు 10: సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఎన్ని కోైట్లెన ఖర్చు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్‌పేట డివిజన్ కళాసీగూడ స్కూల్ వద్ద రూ. 15.50 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి పైపులైన్, మెక్లాడ్గూడలో రూ.18.40 లక్షల తో నిర్మించిన సీవరేజీ పైపులైన్ పనులను కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రహదారుల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను ఇప్పటికే చేపట్టామన్నారు. చుట్టలబస్తీ నుంచి గైదిన్బాగ్ వరకు ఉన్న నాలాకు సైడ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, జలమండలి జీఎం రమణారెడ్డి తహసీల్దార్ బాలశంకర్, మంజుల పాల్గొన్నారు.