హైదరాబాద్ : ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలు(GHMC Wards Offices) ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 16న వార్డు ఆఫీసుల ప్రారంభోత్సవ ఏర్పాట్ల పై చర్చించారు.
మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Minister KTR) ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డు ఆఫీసులు ప్రారంభించాలని నిర్ణయించామని వెల్లడించారు. నిర్మాణ పనులు పూర్తయిన వార్డు ఆఫీసులను మాత్రమే ఈ నెల 16న మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మిగిలిన వాటికి పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలు, లేదా జోనల్ కమిషనర్ కార్యాలయాలకు వెళ్లాల్సివస్తుందని తెలపారు. వార్డు ఆఫీసు వ్యవస్థ తో ప్రజలు తమ సమస్యలను ఇక్కడే తెలుపుకొనే అవకాశం కలుగుతుందని అన్నారు. సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు కూడా ఎంతో సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలకు కూడా ఎంతో మెరుగైన సేవలు(Betterr Service) అందుతాయని, అధికారులకు, ప్రభుత్వానికి మరింత ప్రజాదరణ(Popularity) లభిస్తుందని అన్నారు. సమావేశంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ జీయాఉద్దిన్, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి ,రవి కిరణ్, మమత, పంకజ, సామ్రాట్ అశోక్ డిప్యూటీ కమిషనర్లు , తదితరులు పాల్గొన్నారు.