
రవీంద్రభారతి ఆగస్టు 10: ప్రాచీన కళలైన నాట్యాలను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్, సెక్రెటరీ జి.వసుంధర ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నృత్యోత్సవ సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు. పాశ్చాత్య సంస్కృతి, సంప్రదాయాలను విడనాడి మన ప్రాచీన కళలైన నృత్యం, నాట్యాలను యువతీ, యువకులకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై, నాట్య గురువులపై ఉందన్నారు.
నేడు ప్రాచీన సంస్కృతి మరుగున పడుతోందని ఉల్లాసం, ఉత్సాహం, మేధోశక్తి పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గుర్తు చేశారు. నృత్యం నేర్పిస్తే మన సంస్కృతితో పాటు మానసిక్వత సీఎం కేసీఆర్ మన సంస్కృతి, సాంప్రదయాలకు, కవులకు, కళకారులను గౌరవించి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అంతే కాక నాట్య కళాశాలలు ఏర్పాటు చేసారన్నారు. భవిషత్తులో సంస్కృతి, సంప్రదాయాలైన నాట్యము, నాటకాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి చెప్పారు. అనంతరం, బాలికల చేత ప్రదర్శించిన నృత్యాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పలువురు నాట్య గురువులు, కళాకారులు పీఆర్వో ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.