
రవీంద్రభారతి, ఆగస్టు 19: ప్రపంచ ఫొటో గ్రఫీ డేను పురస్కరించుకొని గురువారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, కాంటెస్టును మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ఫొటో గ్రాఫర్ల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టులకు బాసటగా నిలిచారన్నారు. ఒక్క ఫొటో లక్ష మెదళ్లను కదిలిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫొటో గ్రాఫర్స్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ ధర్మన్న, కార్యదర్శి రజినీకాంత్‌గౌడ్ , కోశాధికారి శివకుమార్, గోపాల్, వెంకట్, సతీష్, శ్రీను, దీపక్ దేశ్‌పాండే, వెంకట్, అలీ, రాజేశ్వర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.