అతివలకు ధైర్యాన్నిచ్చిన షీటీమ్స్
ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పహాడీషరీఫ్, జనవరి 27 : ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 33 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుట్టుమిషన్లతో వచ్చిన ఆదాయంలో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. షీటీమ్స్ ఏర్పాటుతో ఈవ్‌టీజింగ్, పోకిరీల వేధింపులు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్‌సింగ్, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, షీ టీమ్స్ డీసీపీ షేక్ సలీమా, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గంగాదీప్ కోహిలి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణనిచ్చి..
పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
మంత్రి సబితాఇంద్రారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న 33 మంది మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సీపీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

