కందుకూరు, ఆగస్టు 9: స్వరాష్ట్రంలో 15 వేల కంపెనీలు ఏర్పాటు కాగా అందులో 15 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్‌హాలులో రంగారెడ్డి జిల్లా డీఆర్డీవో ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహించారు. ఇందులో 22 కంపెనీలు పాల్గొని 462 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకోగా.. మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. మరీముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రపంచస్థాయి పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు. ఫార్మాసిటీలో సైతం భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. ఇందుకోసం ముందుగా తుక్కుగూడలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మిసురేందర్రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, డీఆర్డీవో ప్రభాకర్, జేడీఎం హమీద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు పొట్టి ఆనంద్ శేఖర్‌రెడ్డి, పారిజాతం, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు దామోదర్‌గౌడ్, సామ మహేందర్‌రెడ్డి, గుయ్యని సామయ్య, కాకి దశరథ, మండల క్రిష్ణ, రవికుమార్‌రెడ్డి, కార్తీక్, దీక్షిత్‌రెడ్డి, ప్రశాంత్ చారి, దేశం మోహన్‌రెడ్డి, బాలమణిఅశోక్, జయమ్మ, ఎండీవో కృష్ణకుమారి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు.