హైదరాబాద్, జనవరి 23: ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా.. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే రోజున టికెట్‌పై 30 శాతం రాయితీతోపాటు కాంబో ఆఫర్‌ను కూడా అందిస్తున్నది. ఈ నెల 24 నుంచి 26 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎనిమిది గంట లు లేదా 11 గంటల ఆఫర్‌ను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికి వర్తించనున్నది. ఈ ఆఫర్ వండర్లాలో అన్ని గేమ్స్, థిమ్స్కు వర్తించనున్నది.