కందుకూరు, ఆగస్టు 9 : రైతులు పామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమైలారంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన, మీర్ఖాన్పేట్లో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అదేవిధంగా పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలను ప్రారంభించి గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. వావిళ్లకుంట తండాలో రూ.79.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ పనులకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పామాయిల్ పంటలను సాగుచేస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అందుకోసం ఎకరాకు రూ.30 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. వేసిన పంట 30 ఏండ్ల పాటు ఉంటుందన్నారు. రైతులు లాభసాటి పంటలను వేసుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. వరి సాగులో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు.
80 శాతం రైతులకు మేలు చేసే విధంగా సీఎం కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. రైతు బీమాకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.1200 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌కు రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చరిత్రలో నిలుస్తుందన్నారు. సర్పంచ్ జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి, వైఎస్ ఎంపీపీ శమంత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు కృష్ణరాంభూపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీలు, రాములు, పద్మ, సర్పంచ్‌లు బాలమణి, రామచంద్రారెడ్డి, సరళమ్మ, నరేందర్‌గౌడ్, ఇందిరమ్మ, సాయిలు, గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహ, నందీశ్వర్, కళమ్మ, రాజు నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షుడు సాయిలు, మండల అధ్యక్షుడు జయేందర్, ఉపాధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.