మహేశ్వరం, ఆగస్టు7 : సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రాంచంద్రగూడ గ్రామానికి చెందిన మహేశ్‌గౌడ్ గతంలో రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. అతనికి ఇచ్చిన హామీ మేరకు ఎంపీ ల్యాండ్ క్రింద మంజూరైన రూ. 6,96,800 చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా చేపట్టి, పూర్తి చేస్తుందని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమగల్ల చంద్ర య్య, సర్పంచ్ శివరాజునాయక్, ఉపసర్పంచ్ అభిలాశ్గౌడ్, వార్డు సభ్యులు డెడ్యానాయక్, రమేశ్, శ్రీకాంత్, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆర్కేపురం, ఆగస్టు 7 : సరూర్‌నగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించే బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని శనివారం పోచమ్మ, బంగారు మైసమ్మ, కట్ట మైసమ్మ, ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నాయకులు బోయిని మహేందర్‌యాదవ్, సప్పిడి గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, నరేశ్‌గౌడ్, మల్లేశ్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.