
బడంగ్‌పేట, జూలై 2: పట్టణాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, వాటి రూపు రేఖలు మార్చేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్లు తీగల విక్రమ్‌రెడ్డి, ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రతిజ్ఞ చేయించారు. పాదయాత్ర చేసి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం రూ.148 కోట్లను మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు నేరుగా కేటాయిస్తుందని చెప్పారు.