మహేశ్వరం, జూలై 1 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో రూ. 50లక్షల నిధులతో బస్సు టెర్మినల్‌ను, సిరిగిరిపురం గ్రామంలో పల్లె ప్రగతి పనులను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో గ్రామంలో పల్లెప్రగతిలో జరిగిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు వెయ్యికోట్లు వెచ్చించి పల్లెప్రగతి పనులను చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధిక నిధులను కేటాయిస్తున్నారన్నారు. సిరిగిరిపురంలో ఇంటిమీద కరెంటు వైర్లు ఉన్నాయని కాసుల నర్సింహ మంత్రి దృష్టికి తీసుకురావడంతో స్పందించి మంత్రి 10రోజుల్లో ఇంటిపై నుంచి కరెంటు వైర్లను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సిరిగిరిపురం గ్రామం పల్లెప్రగతితో ముందంజలో ఉన్నందున ఆ గ్రామానికి రూ. 20లక్షలు మంజూరు చేశారు. గతంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేసేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తడి, పొడి చెత్తను వేర్వేరు వేసి వాటిని కంపోస్టు ఎరువులుగా మార్చుతున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో నీటి ఎద్దడికి తావు లేకుండా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. పల్లెప్రగతిలో ప్రజలందరూ పాల్గొని జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, పంచాయతీరాజ్ ట్రిబ్యూనల్ మెంబర్ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునీతాఆంద్యానాయక్, సహకారబ్యాంక్ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ ప్రియాంకరాజేష్, కాసుల సురేష్, మద్ది సురేఖకరుణాకర్‌రెడ్డి, సాలీ వీరానాయక్, జిల్లా రైతుబంధు నాయకుడు కూన యాదయ్య, కో-ఆప్షన్ సభ్యులు హదిల్అలీ, ఎంపీటీసీలు సుదర్శణ్యాదవ్, విజయ్‌కుమార్, ఆర్ఎం సీహెచ్ వెంకన్న, డీవీఎం గాలెంకి రాములు, డీఎం శ్రీనివాస్ నాయకులు కరోళ్ల చంద్రయ్యముదిరాజ్, మంత్రిరాజేశ్, నవీన్, దోమశ్రీనివాస్రెడ్డి, యువజన నాయకులు శ్రీను వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బడంగ్‌పేట, జూలై 1 : క్రీడ స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఇండోర్ స్టేడియాలు ఎంతో ఉపయోగ పడుతాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 5వ డివిజన్లో ఫిట్నెస్ ఫ్రిక్ అరేన ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి కాసేపు షటిల్ ఆడి క్రీడకారులను ఉత్సాహపరిచారు. అనతంరం క్రికెట్, వాలీబాల్, షటిల్ క్రీడ మైదానాలను ఆమె పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి నీళ్లు పోశారు. చిన్న, పెద్ద అందరూ ఆడుకోవడానికి క్రీడ మైదానాలను నిర్వహకులు బండారి మనోహర్, వెంకట్‌రెడ్డి భాగా తీర్చిదిద్దారని అన్నారు. పిల్లల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని ఆమె అన్నారు. ఒకే చోట అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి మంచి అవకాశం ఉందన్నారు.
డివిజన్ స్థాయి నుంచి శిక్షణ తీసుకొని మంచి క్రీడకారులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి స్టేడియాలు ఏర్పాటు చేయడం వలన పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు, క్రీడాకారులకు ఉపయోగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కార్పొరేటర్లు బండారి మనోహర్, బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, అర్జున్, గడ్డం లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంరెడ్డి వెంకట్‌రెడ్డి, బీమిడి జంగారెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్‌రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, ముత్యాల కృష్ణ, ఏనుగు తిరుమల్‌రెడ్డి, కుంచ నాగేందర్‌గౌడ్ ఉన్నారు.