
ఆర్కేపురం, జూన్ 30 : ఆర్కేపురం డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్డు నెం. 2, 3లలో రూ. కోటి 73లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు, ఎన్టీఆర్నగర్ ఫేజ్- 3లో రూ. 16లక్షల వ్యయంతో మల్టీపర్పస్ షేడ్ నిర్మాణ పనులకు మంత్రి కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందులో భాగంగానే అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయించడం తమ బాధ్యతని, పనులు సక్రమంగా చేయించుకోవడం కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులదేనని అన్నారు.
కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కాలనీవాసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా లోపించకుండా చూసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని అన్ని కా లనీల అభివృద్ధి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, పగిళ్ల భూపాల్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీమన్నారాయణ, ఎస్.కె.మహ్మద్, పెంబర్తి శ్రీనివాస్, రాజు శ్రీవాస్తవ, శ్యామ్గుప్తా, సాజీద్, బండారి మల్లేశ్, యాదవరెడ్డి, దుబ్బాక శేఖర్, ఫరీద్ పాషా, అల్లావుద్దిన్ పటేల్, ఆకుల అరవింద్, సిరిపురం రాజేష్‌గౌడ్, శైలజారెడ్డి, పుష్షలతారెడ్డి, లిక్కీ ఊర్మిలారెడ్డి, సుజాతారెడ్డి పాల్గొన్నారు.