
బడంగ్‌పేట, మే 29: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవలసిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మేము సైతం కార్యక్రమంలో భాగంగా మీర్‌పేట పోలీసుల ఆధ్వర్యంలో శనివారం బడంగ్‌పేట పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని.. ఈ క్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోతం రెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డి, డీఐ సత్యనారాయణ, ఎస్ఐ మారయ్య చొరవ తీసుకొని వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయం అన్నారు. దివ్యాంగులకు అండగా ఉంటామని.. డబుల్ బెడ్ రూం ఇండ్లలో వికలాంగుల కోట ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, ఏసీపీ పురుషోతం రెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డి, డీఐ సత్యనారాయణ, ఎస్ఐ మారయ్య, కార్పొరేటర్లు అర్జున్, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, ఆనంద్‌రెడ్డి ఉన్నారు.