పహాడీషరీఫ్, నవంబర్ 7: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం చేస్తూ సీఎం కేసీఆర్ ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట పింక్ ప్యాలెస్ ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 201 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమన్నారు. ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తూ కేసీఆర్ ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారన్నారు.
మూడేండ్లలో బాలాపూర్ మండల పరిధిలోనే 3,480 మంది లబ్ధిదారులకు రూ. 34.84కోట్లు అందించామన్నారు. అనంతరం ఎర్రకుంట బారా మల్గి వద్ద టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ తహసీల్దార్, సుబ్రహ్మణ్యం, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హాన నాజ్, కమిషనర్ జీపీ కుమార్, కో – ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అహ్మద్ కసాది, పహిమిదా షేక్ అప్జల్, శంషోద్దీన్, జాఫర్ బామ్, కెంచె లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, నాయకులు యూసుఫ్ పటేల్, ఖైసర్ బామ్, యంజాల జనార్దన్, యాస్మిన్ బేగం, వాసుబాబు, మన్నన్, సయ్యద్ యాహియా, హసన్, హాజీ నవాబ్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, నవంబర్ 7 : పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు 59 షాదీముబారక్, 9 కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్తో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో ఈ పథకం అమలు చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లలో 1033 మంది లబ్ధిదారులకు రూ.7కోట్ల 38లక్షల పై చిలుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ తహసీల్దార్ రామ్మోహన్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, నాయకులు పారుపల్లి దయాకర్‌రెడ్డి, సిరిపురం రాజేశ్‌గౌడ్, గొడుగు శ్రీనివాస్, సాజీద్, దుబ్బాక శేఖర్, ఫరీద్ పాష, సుదర్శన్ముదిరాజ్, రాఘేంద్రగుప్తా, యుగందర్శర్మ, ప్రత్యూష్, గోవర్ధన్‌రెడ్డి, లిక్కి ఊర్మిలారెడ్డి, చామల శైలజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.