కందుకూరు, అక్టోబర్ 18 : టీఆర్ఎస్ పార్టీకి యువకులు పట్టుగొమ్మలు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన కొలను విఘ్నేశ్వర్రెడ్డిని టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షునిగా నియమిస్తు నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి, పార్టీకి యు వకులు వారిధిగా ఉంటూ పని చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు శేఖర్‌రెడ్డి, ఆనంద్, పాండురంగారెడ్డి, ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల స్వయం ఉపాధి భవనానికి స్థలం కేటాయించి నిర్మాణం చేయాలని కోరారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం కేటాయిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మండల పరిధిలోని మాదాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మంద సాయి లు ఆధ్వర్యంలో సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు. గ్రామాలకు కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు.