కందుకూరు, అక్టోబర్ 10 : ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్రెడ్డి, కృష్ణ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని సూచించారు. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేదునూరు గ్రామంలో సోలిపేట్ వెంకట్రెడ్డి కుంటుంబ సభ్యులను అనంతరం సరస్వతిగూడలో కృష్ణ, మురియు అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో పాటు పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి తెలిపారు. మంత్రి వెంట టీఆర్ఎస్ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు యాలాల శ్రీనివాస్, కాసుల రామకృష్ణారెడ్డి, రాము, పీఏసీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, అంజయ్య. ఎంపీటీసీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.