‘ఉప్పెన’ చిత్రంలో బేబమ్మ పాత్ర ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మంగళూరు చిన్నది కృతిశెట్టి. అరంగేట్రం అద్భుతంగా జరిగినా ఆ తర్వాత ఈ భామకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ‘మనమే’ తర్వాత తెలుగులో మరే సినిమాలో నటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ భామ చిరంజీవి 158వ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైందని సమాచారం. ఇటీవలే ‘మనశంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి..ప్రస్తుతం తన 158వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం జరుపుకొని..మార్చిలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుందంటున్నారు. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశమిదని సమాచారం. ఇందులో చిరంజీవి కూతురుగా కృతిశెట్టి నటించనుందని, ఆమెను ఈ సినిమా కోసం దాదాపుగా ఖరారు చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి సరసన నాయికగా ప్రియమణి నటించనుందని సమాచారం. మొత్తానికి తెలుగులో కొంచెం గ్యాప్ తీసుకున్నా.. మెగా ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకొని వార్తల్లో నిలుస్తున్నది కృతిశెట్టి.