చిక్కడపల్లి, సెప్టెంబర్ 30: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అశోక్‌నగర్‌లోని నగర గ్రంథాలయంలో 2న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నగర గ్రంథాలయం చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి తెలిపారు. జాబ్ మేళాకు హాజరుకావాలని కోరుతూ గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని కలిసిన ప్రసన్న వారికి ఆహ్వాన పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు 50 కంపెనీలు పాల్గొంటాయని, ఈ జాబ్ మేళాను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరవుతారన్నారు.