ఆర్కేపురం, సెప్టెంబర్12: టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏ పదవి వచ్చినా స్వీకరించి పార్టీ నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పార్టీకి పట్టుగొమ్మలు కార్యకర్తలేనని, వారిని కాపాడుకుంటామన్నారు. డివిజన్ కమిటీల్లో కష్టపడే కార్యకర్తలకు అవకాశం ఉంటుందన్నారు. డివిజన్లవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి డివిజన్ లో సోషల్ మీడియా కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు.
డివిజన్లవారీగా బూత్‌స్థాయి, బస్తీ కమిటీలను ఏర్పాటు చేస్తామని, అం దుకు సంబంధించిన పేర్లను జాబితాగా రెడీ చేసి తనకు ఇవ్వాలని నాయకులకు సూచించారు. ఆర్కేపురం డివిజన్లో పార్టీ బలోపేతానికి అరవింద్‌శర్మ తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తూ నే పార్టీ జెండామోసిన వారితోపాటు సీఎం కేసీఆర్ నా యకత్వాన్ని బలపర్చేందుకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా పార్టీ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, డివిజన్ ఇన్చార్జి నెంటూరి రవీంద్‌రెడ్డి, నాయకులు మారోజు రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, సాజీద్, తాడేపల్లి వెంకటేశంగుప్తా, జగిని రమేశ్, పెంబర్తి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, శేఖర్, ఫరీద్, రమేశ్, భూపాల్‌రెడ్డి, లింగస్వామిగౌడ్, శంకర్‌నాయక్, వెంకటేశ్‌గౌడ్, గిరినందన్గౌడ్, శైలజారెడ్డి, ఊర్మిలారెడ్డి,సుజాతారెడ్డి పాల్గొన్నారు.
ఆర్కేపురం, సెప్టెంబర్12: సరూర్‌నగర్ డివిజన్లో పార్టీ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్లోని మంత్రి క్యాం పు కార్యాలయంలో సరూర్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌కుమార్ అధ్యక్షత నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబితారెడ్డి హాజరై మాట్లాడుతూ డివిజన్ కమిటీలకు తోడుగా అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నాయకులు దయాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, రాజేశ్‌గౌడ్, రాఘవేంద్రగుప్త్తా, శేఖర్‌రెడ్డి, సుధామ, రాజు, ప్రత్యూశ్, ప్రవీణ్, మల్లేశ్, సలీం తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, సెప్టెంబర్12: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇటీవల వారియర్ కరాటే డో ఫెడరేషన్ ఆధ్వర్యంలో బొమ్మిడిలలిత గార్డెన్లో జరిగిన నేషనల్ కప్, కరాటే చాంపియన్‌షిప్‌లో కరాటే డు స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారిణి నందిని అండర్-16 బాలికల బ్లాక్ అం డ్ బ్రౌన్ బెల్డ్ విభాగంలో కప్ సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం మాస్టర్ మహేశ్నాయక్తో కలిసి నందిని మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.