బడంగ్‌పేట, సెప్టెంబర్4 : బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు గాను రూ.42.76కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న చెరువుల సుందరీకరణ పనుల పనులు ఏ దశలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారిచేశారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న అన్ని చెరువులను సుందరీకరణ చేయిస్తామని పేర్కొన్నారు . అల్మాస్గూడ చెరువుల సుందరీకరణ పనులు పూర్తికాగానే నాదర్గుల్, బాలాపూర్ చెరువుల సుందరీకరణ పనులు చేపడుతామన్నారు.
ఎజెండాలో ఉన్న అంశాలను మంత్రి చర్చించారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులు, మిషన్ భగీరథ పనుల తీరుపై ఆరా తీశారు. మిషనర్ భగీరథ పైపులైన్ పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి ఒకరోజు తప్పించి మరోరోజు తాగునీటి సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు. బడంగ్‌పేట ప్రధాన రహదారుల విస్తరణ, రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి నిధులు రూ.3.88 కోట్లు, ఎల్ఆర్ఎస్ నిధులు రూ.4.46 కోట్లు, 14 ఫైనాన్స్ నుంచి రూ.11.27కోట్లు, సాధారణ నిధుల నుంచి రూ.23.15 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, డీఈ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్లు పి శ్రీనివాస్‌రెడ్డి, జె పద్మ, ఆర్ మాదురి, సంరెడ్డి స్వప్న, బోయపల్లి దీపిక, డి శంకర్, జి లక్ష్మారెడ్డి, ఇంద్రసేన, నిమ్మల సునీత, రోహిణి, శివకుమార్, పవన్ కుమార్, జె భారతమ్మ, బాలు నాయక్, ఆర్ మహేశ్వరి, వి ప్రభాకర్‌రెడ్డి, బి మనోహర్, ఆర్ అమిత, పి సుదర్శన్‌రెడ్డి, అనితా రాణి, ఎల్ మమతారెడ్డి,ఆర్ సంతోషి, ఎ రాంరెడ్డి, ఎం లలిత, ఆర్ కవిత, టీ శ్రీధర్‌రెడ్డి, ఎస్ అర్జున్, పి శోభారెడ్డి, బి స్వప్నారెడ్డి, జి రమాదేవి, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.