మహేశ్వరం,ఆగస్టు 18 : తండాల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగారం, పడమటితండా, దిలావార్గూడలో 1.30 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు సహకార బ్యాంకు చైర్మన్ మంచె పాండుయాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తండాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలు రాకుండా ఉండాలనే ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను వాడుకలోకి తీసుకొచ్చిందన్నారు. అనంతరం నాగారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బండారు లావణ్యలింగం, అనితారవినాయక్, పరిగి చంద్రశేఖర్‌రెడ్డి, శివిరాజునాయక్, మోతీలాల్‌నాయక్, మెగావత్ రాజునాయక్, రాజేశ్, వీరానాయక్, కంది రమేశ్, ముక్కెర యాదయ్య, అనిత, నాగారం ఎంపీటీసీ వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి ఉన్నారు.