కందుకూరు, సెప్టెంబర్ 25: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం కందుకూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 10 గంటలకు సరస్వతీగూడలో అభివృద్ధి పనులను ప్రారంభించి, అక్కడి నుంచి లేమూరు, అగర్మియాగూడ, తిమ్మాపూర్, జబ్బారుగూడ, కొలనుగూడ, రాచులూరు, గుమ్మడవెల్లి, బైరాగిగూడ.. తదితర గ్రామాల్లో దాదాపు 12 గంటల పాటు పర్యటించి రూ.12కోట్లతో 64 అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు అధికారం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం సీఎం కేసీఆర్ వల్లేనని చెప్పారు. ప్రజలకు ఇంత మంచి పాలనను ఇప్పటి వరకు ఎవరూ అందించలేదని తెలిపారు. తిరిగి సీఎం కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు.
దేశానికి నేడు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వస్తుందని, ఎవ్వరూ ఆందోళన పడవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సురుసాని రాజశేఖర్‌రెడ్డి, పీఎంసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ గోపీరెడ్డి విజేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, వట్నాల ఈశ్వర్‌గౌడ్, కాకి దశరథ ముదిరాజ్, మహేందర్‌రెడ్డి, ఎలుక మేఘనాథ్ రెడ్డి, సోలిపేట అమరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వట్నాల శోభ, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.