సిటీబ్యూరో, నవంబరు 5(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సర్వేను లాంఛనంగా ప్రారంభిస్తారు. మేయర్ జీవీ లక్ష్మి, డిప్యూటీ మేయర్ ఎంఎస్ఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మం త్రి ఈ సర్వేను ప్రారంభిస్తారని అధికారులు మంగళవారం పేర్కొన్నారు. 6వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ సర్వేలో సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి సర్వే చేయనున్నారని తెలిపారు.