బీర్కూర్, నవంబర్ 7 : శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 21న తన కుమార్తె అరుణ, అల్లుడు వెంకట్రాంరెడ్డి కుమార్తె స్నిగ్ధారెడ్డి వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను వివాహానికి ఆహ్వానించారు. స్పీకర్ వెంట ఆయన సతీమణి పుష్పమ్మ, కూతురు అరుణ, అల్లుడు వెంకట్రాంరెడ్డి, కుమారులు రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.