కార్తిక..వైభవం
నియోజకవర్గ వ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్లి స్వామివార్లకు ప్రత్యే పూజలు చేసి కార్తిక దీపాలను వెలిగించారు
- భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి వేడుకలు
- తెల్లవారుజామునుంచే ఆలయాల్లో పూజలు
- కీసరగుట్టలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి
- కార్తిక దీపాలు వెలిగించిన మహిళలు
పీర్జాదిగూడ/ఘట్కేసర్/కీసర, నవంబర్ 8: నియోజకవర్గ వ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్లి స్వామివార్లకు ప్రత్యే పూజలు చేసి కార్తిక దీపాలను వెలిగించారు.జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే గర్భాలయంలో స్వామివారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల స్వామివారికి తేనె, ఆవుపాలు, పంచామృతంతో మహాన్యాస రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.
మంత్రి చామకూర మల్లారెడ్డి,మంత్రి తనయుడు భద్రారెడ్డితో కలిసి ఉదయమే ఆలయానికి చేరకొని స్వామివారి అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు ఆల య చైర్మన్ ఉమాపతిశర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్‌రెడ్డి, వేదపండితులు కలిసి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు మంత్రిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్ మాధురి వెంకటేశ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు నాయకపు పాల్గొన్నారు.
మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన వార్డు సభ్యులు రాజిరెడ్డి స్వచ్ఛందంగా కీసరగుట్ట ఆలయానికి 12 ఎల్ఈడీ లైట్లను మంగళవారం మంత్రి చేతుల మీదుగా బహూకరించారు. అదేవిధంగా కీసర శ్రీ ప్రసన్నంజనేయస్వామి ఆలయంలో భక్తులు కార్తికమాసోత్సవంలో భాగంగా కార్తికదీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామి, శ్రీ విగ్నేశ్వర ఆలయాల్లో మూల మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

