బోడుప్పల్, నవంబర్ 26 : మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్లో 10 వేల మంది మహిళలతో ఆదివారం నిర్వహించిన మహిళా గర్జన ర్యాలీ విజయవంతమైంది. దారులన్నీ గులాబీమయమయ్యాయి. రానున్న ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని, హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి ధీమావ్యక్తం చేశారు. ర్యాలీకి తరలివచ్చిన మహిళలను చూస్తుంటే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమనిపిస్తుందని చెప్పారు.